back to top
31.2 C
Hyderabad
Sunday, March 1, 2026
HomeTelangana Newsకాంగ్రెస్ పాలనలో సింగరేణి బొగ్గు ఉత్పత్తి తగ్గింది: హరీష్ రావు ఆరోపణలు

కాంగ్రెస్ పాలనలో సింగరేణి బొగ్గు ఉత్పత్తి తగ్గింది: హరీష్ రావు ఆరోపణలు

Harish Rao:  బొగ్గు ఉత్పత్తి తగ్గింది

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న స్కాములు, అనాలోచిత నిర్ణయాల కారణంగా సింగరేణి కాలరీస్‌లో బొగ్గు ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు.

Follow BuzzNewsline: Twitter (X) | Instagram

బీఆర్ఎస్ పాలనలో ప్రతి సంవత్సరం సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి స్థిరంగా పెరిగిందని గుర్తు చేసిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బొగ్గు ఉత్పత్తి, అమ్మకాలు రెండూ తగ్గుముఖం పట్టాయని విమర్శించారు.

సింగరేణి వంటి కీలక సంస్థను రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని హరీష్ రావు తెలిపారు. కార్మికుల భవిష్యత్తు, రాష్ట్ర ఆర్థిక స్థిరత్వం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన ఆరోపించారు.

మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Buzznewsline
Buzznewsline
BuzzNewsline is a next-gen digital media platform delivering real-time news, trending stories, and deep insights across sports, politics, entertainment, tech, and more — all in one place.”

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles