Solar Model Village: ప్రతి ఇల్లు, ప్రతి పంపుసెట్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మారాలి
మధిర నియోజకవర్గం బోనకల్లు మండలం రావినూతల గ్రామంలో సోలార్ మోడల్ విలేజ్ కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి ఇల్లు, ప్రతి వ్యవసాయ పంపుసెట్ విద్యుత్ వినియోగదారులుగానే కాకుండా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలుగా మారాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
దేశంలోనే కాకుండా ప్రపంచస్థాయిలో విప్లవాత్మక ఆలోచనతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 81 గ్రామాల్లో రూ.1,380 కోట్ల వ్యయంతో సోలార్ మోడల్ విలేజ్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల
🔹 కుటుంబాలకు అదనపు ఆదాయం,
🔹 రైతులకు లాభదాయకమైన వ్యవసాయం,
🔹 రాష్ట్రానికి స్వచ్ఛమైన పునరుత్పాదక శక్తి
లభిస్తాయని వివరించారు.
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ప్రజలను విద్యుత్ వినియోగదారుల నుంచి విద్యుత్ ఉత్పత్తిదారులుగా మార్చే దిశగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని భట్టి విక్రమార్క గారు తెలిపారు. ఈ సోలార్ మోడల్ గ్రామాలు భవిష్యత్ తెలంగాణకు మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


