Special Intensive Revision Telangana: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి
హైదరాబాద్ / జగిత్యాల: శనివారం హైదరాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి, ఐఏఎస్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) నిర్వహణపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో ఐడిఓసి కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ, అన్ని జిల్లాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేసి, రివిజన్ శాతం పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మ్యాపింగ్‌లో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా ప్రతి ఇంటి నుంచి ఖచ్చితమైన వివరాలు సేకరించాలన్నారు.
రివిజన్ మ్యాపింగ్ శాతం పెంచేందుకు బూత్ లెవల్ ఆఫీసర్లు తప్పనిసరిగా ఫీల్డ్ విజిట్లు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంటింటి సర్వే ద్వారా ఓటర్ల వివరాలను నిర్ధారించి, శాతం పెంచే దిశగా పని చేయాలన్నారు.
అలాగే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు తమ బూత్ లెవల్ ఏజెంట్లను వెంటనే నియమించుకోవాలని, మ్యాపింగ్ సమయంలో తప్పు ఎంట్రీలు, తప్పు లింకింగ్‌లు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఓటర్ల సౌలభ్యం కోసం “బుక్ ఎ కాల్ (Book a Call)” సదుపాయంపై విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు.
ప్రతి ఓటరు పేరు సరైన పోలింగ్ స్టేషన్‌కు మ్యాప్ కావడం ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకం అని, అధికారులు మరియు సిబ్బంది పూర్తి బాధ్యతతో పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారులకు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ, జగిత్యాల జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 69.94 శాతం పూర్తయిందని తెలిపారు. మిగిలిన ప్రక్రియను 100 శాతం పూర్తి చేసేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.
మ్యాపింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తూ, ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా, తప్పు ఎంట్రీలు జరగకుండా ప్రతి ఓటరు మ్యాప్ అయ్యేలా ప్రతి ఇంటి నుంచి ఖచ్చితమైన, నిర్ధిష్టమైన వివరాలు సేకరించాలని అన్ని స్థాయిల అధికారులకు సూచించారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


