Sri Jogulamba Ammavaru Brahmotsavams: శ్రీ జోగుళాంబ అమ్మవారు వార్షిక బ్రహ్మోత్సవాలు
ఈ నెల 19 నుంచి 23 వరకు నిర్వహించనున్న శ్రీ జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల (Sri Jogulamba Ammavaru Brahmotsavams)సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారు, ఆలయ ఈవోతో పాటు అర్చక పండితులతో కలిసి భక్తులకు అధికారికంగా ఆహ్వానం అందించారు.
ఈ సందర్భంగా అర్చక పండితులు అమ్మవారి వేదోక్త ఆశీర్వచనాలు అందించి, బ్రహ్మోత్సవాలు శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో, విజయవంతంగా నిర్వహించబడాలని ఆకాంక్షించారు.
రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. భద్రత, వసతి, తాగునీరు, ప్రసాద పంపిణీ వంటి ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చక పండితులు, దేవాదాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


