back to top
22.7 C
Hyderabad
Monday, March 2, 2026
HomeTelangana Newsకరీంనగర్ పాత బజార్‌లో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు | ఈనెల 23 నుంచి ప్రారంభం

కరీంనగర్ పాత బజార్‌లో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు | ఈనెల 23 నుంచి ప్రారంభం

Karimnagar Brahmotsavams: కరీంనగర్ జిల్లాలో శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సన్నాహక సమావేశం

కరీంనగర్ జిల్లా పాత బజార్‌లో నిర్వహించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణకు సంబంధించి సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి గారు, సుడా చైర్మన్ శ్రీ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, ఆర్టీఏ మెంబర్ శ్రీ పడాల రాహుల్ గారు, కరీంనగర్ కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ శ్రీ కర్ర రాజశేఖర్ గారు, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ అంజన్ కుమార్ గారు, ఆలయ చైర్మన్, ఈవోతో పాటు ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు.

Follow BuzzNewsline: Twitter (X) | Instagram

ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల నిర్వహణపై పలు అంశాలపై చర్చించగా, ఈ నెల 23వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని, 1వ తేదీన శోభాయాత్ర నిర్వహించనున్నట్లు నిర్ణయించారు. బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడానికి కరీంనగర్ ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నాయకులు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలంతా సుఖసంతోషాలతో, పాడిపంటలతో, సమృద్ధి వర్షాలతో ఉండాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Buzznewsline
Buzznewsline
BuzzNewsline is a next-gen digital media platform delivering real-time news, trending stories, and deep insights across sports, politics, entertainment, tech, and more — all in one place.”

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles