back to top
24.7 C
Hyderabad
Monday, March 2, 2026
HomeTelangana Newsన్యూ ఇయర్ సందర్భంగా డ్రంకెన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు

న్యూ ఇయర్ సందర్భంగా డ్రంకెన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు

New Year Drunken Drive Checks– 120 ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు

న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో నగర పోలీసు శాఖ కఠిన చర్యలకు సిద్ధమైంది. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. నగర వ్యాప్తంగా 120 ప్రాంతాల్లో ఈ రోజు రాత్రి ప్రత్యేక డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు (New Year Drunken Drive Checks )నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Follow BuzzNewsline: Twitter (X) | Instagram

ఈ స్పెషల్ డ్రైవ్ జనవరి మొదటి వారం అంతా కొనసాగనుంది. మద్యం సేవించి పట్టుబడితే భారీ జరిమానాతో పాటు వాహనాలను సీజ్ చేయడం, జైలు శిక్ష విధించడం, డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేయడం వంటి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అలాగే రాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, బహిరంగ ప్రదేశాల్లో అసభ్య ప్రవర్తన లేదా న్యూసెన్స్ సృష్టించే వారిపై కూడా కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు తెలిపారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా ఈ తనిఖీలు చేపడుతున్నామని స్పష్టం చేశారు.

మద్యం సేవించిన వారు వాహనాలు నడపకుండా క్యాబ్ సేవలు లేదా డ్రైవర్లను ఆశ్రయించాలని పోలీసులు సూచించారు. కొత్త సంవత్సరాన్ని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి సురక్షితంగా, ఆనందంగా జరుపుకోవాలని పోలీసు శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Buzznewsline
Buzznewsline
BuzzNewsline is a next-gen digital media platform delivering real-time news, trending stories, and deep insights across sports, politics, entertainment, tech, and more — all in one place.”

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles