back to top
31.2 C
Hyderabad
Sunday, March 1, 2026
HomeTelangana Newsసిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ | క్యాన్సర్ ఆసుపత్రిలో సేవలపై హరీశ్ రావు ఆరా

సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ | క్యాన్సర్ ఆసుపత్రిలో సేవలపై హరీశ్ రావు ఆరా

Siddipet Government Hospital: క్యాన్సర్ ఆసుపత్రిలో సేవలపై ఆరా… జీతాలు చెల్లించాలని అధికారులకు ఆదేశం

సిద్దిపేట: సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీ హరీశ్ రావు ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా క్యాన్సర్ ఆసుపత్రిలోని ఐసీయూ విభాగంలో అందుతున్న వైద్య సేవలను స్వయంగా పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Follow BuzzNewsline: Twitter (X) | Instagram

ఆసుపత్రిలో రోగులకు అందుతున్న ఆహారం, వసతులపై ఆరా తీసిన హరీశ్ రావు
“నేనే అన్నం పెడుతున్నాను… రోజూ సక్రమంగా అందిస్తున్నారా? సౌకర్యాలు బాగున్నాయా?” అని ప్రశ్నించారు.

రోగులకు అవసరమైన మందులను బయటకు రాయవద్దని, ఆసుపత్రిలోనే మందులు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు.
క్యాన్సర్ బాధితులకు మెరుగైన, మానవీయ వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా క్యాన్సర్ ఆసుపత్రి సిబ్బంది మూడు నెలలుగా జీతాలు రావడం లేదని తెలియజేయడంతో, జిల్లా వైద్య అధికారితో ఫోన్‌లో మాట్లాడిన హరీశ్ రావు తక్షణమే జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా నిరంతరం పర్యవేక్షణ అవసరమని, ముఖ్యంగా క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న రోగులకు పూర్తి స్థాయి సేవలు అందించాలని ఆయన సూచించారు.

మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Buzznewsline
Buzznewsline
BuzzNewsline is a next-gen digital media platform delivering real-time news, trending stories, and deep insights across sports, politics, entertainment, tech, and more — all in one place.”

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles