District Collector Ila Tripathi: రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా యాసంగి సీజన్‌కు అవసరమైన యూరియా ఎరువుల నిల్వలు పూర్తిగా అందుబాటులో ఉన్నాయని, ఎలాంటి కొరత ఉండబోదని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఇల త్రిపాఠి గారు రైతులకు భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా కలెక్టర్ గారు అంకాపూర్‌లోని ఎరువుల గోదామును సందర్శించి యూరియా నిల్వలను ప్రత్యక్షంగా పరిశీలించారు. గోదాములో ఉన్న సరుకు వివరాలను అధికారులను అడిగి తెలుసుకొని, సరఫరా వ్యవస్థ సజావుగా కొనసాగుతున్నదని నిర్ధారించారు. అనంతరం అక్కడికి వచ్చిన రైతులతో మాట్లాడి, యాసంగి పంటల అవసరాలకు తగినంత యూరియా అందుబాటులో ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
అనంతరం ఒక రైతు పొలంలో డ్రోన్ టెక్నాలజీ ద్వారా నానో యూరియా పిచికారీ జరుగుతున్న తీరును కలెక్టర్ గారు పరిశీలించారు. తక్కువ ఖర్చుతో, సమర్థవంతంగా ఎరువుల వినియోగం సాధ్యమయ్యే నానో యూరియా పద్ధతిని రైతులు మరింతగా అవలంబించాలని సూచించారు. ఇది సుస్థిర వ్యవసాయానికి దోహదపడుతుందని, నేల ఆరోగ్యం పరిరక్షణకు ఉపయోగకరమని పేర్కొన్నారు.
వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సరైన మార్గనిర్దేశం అందించాలని, ఆధునిక సాంకేతికతలను ప్రోత్సహిస్తూ వ్యవసాయ ఉత్పాదకతను పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారు ఆదేశించారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


