Nursing Students: నర్సింగ్ విద్యార్థుల కోసం జపనీస్, కొరియన్ మరియు జర్మన్ భాషా శిక్షణా
తెలంగాణ నర్సింగ్ విద్యార్థులకు అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జపాన్, దక్షిణ కొరియా మరియు జర్మనీలలో నర్సులకు ఉన్న అధిక డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, నర్సింగ్ విద్యార్థుల కోసం జపనీస్, కొరియన్ మరియు జర్మన్ భాషా శిక్షణా సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నట్లు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు.
ఈ నిర్ణయంతో తెలంగాణ నర్సులు ప్రపంచ స్థాయిలో తమ ప్రతిభను చాటుకునే అవకాశం పొందనున్నారు. ఆరోగ్య సంరక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయంగా మంచి గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
నాణ్యమైన వైద్య సేవలతో పాటు నైపుణ్యం కలిగిన మానవ వనరులను ప్రపంచానికి అందిస్తూ, తెలంగాణ కీర్తిని గ్లోబల్ స్థాయిలో ఇనుమడింపజేస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


