back to top
31.2 C
Hyderabad
Sunday, March 1, 2026
HomeTelangana Newsఆదిలాబాద్‌లో 11వ తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం

ఆదిలాబాద్‌లో 11వ తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం

Adilabad Athletics News: ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహిస్తున్న 11వ తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ అథ్లెటిక్స్

ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహిస్తున్న 11వ తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు గోడం నగేష్, ఖానాపూర్ శాసన సభ్యులు వెడ్మా బొజ్జుతో కలిసి క్రీడా జ్యోతి వెలిగించి పోటీలకు శ్రీకారం చుట్టారు.

Follow BuzzNewsline: Twitter (X) | Instagram

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి చేరుకోవాలని క్రీడాకారులను ప్రోత్సహించారు.

ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ శ్రీనివాస్, వివిధ జిల్లాల అధికారులు, ప్రజా ప్రతినిధులు, క్రీడా సంఘాల నాయకులు, క్రీడాకారులు, కోచ్‌లు, విద్యార్థులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన సబ్ జూనియర్ క్రీడాకారుల ఉత్సాహం స్టేడియంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Buzznewsline
Buzznewsline
BuzzNewsline is a next-gen digital media platform delivering real-time news, trending stories, and deep insights across sports, politics, entertainment, tech, and more — all in one place.”

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles