Nirmal festivities: నిర్మల్ ఉత్సవాల ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలి : కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్ ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 19 నుంచి 23 వరకు అయిదు రోజుల పాటు నిర్మల్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
గత సంవత్సరం నిర్మల్ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు సాధించామని, ఈ ఏడాది మరింత ఉత్సాహంతో, సమన్వయంతో అధికారులు పని చేయాలని సూచించారు. ఉత్సవాల సందర్భంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమిష్టిగా బాధ్యతలు నిర్వహించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


