back to top
31.2 C
Hyderabad
Sunday, March 1, 2026
HomeTelangana Newsభూభారతి పోర్టల్ దేశానికే ఆదర్శం: పొంగులేటి శ్రీనివాస రెడ్డి

భూభారతి పోర్టల్ దేశానికే ఆదర్శం: పొంగులేటి శ్రీనివాస రెడ్డి

TRESA Diary 2026 Launch: TRESA కార్యాలయంలో నిర్వహించిన 2026 డైరీ ఆవిష్కరణ

తెలంగాణ రెవెన్యూ వ్యవస్థను సమూలంగా సంస్కరించి గ్రామ స్థాయి వరకు బలోపేతం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు.

Follow BuzzNewsline: Twitter (X) | Instagram

ఈరోజు హైదరాబాద్ నాంపల్లిలోని ట్రెస్సా (Telangana Revenue Employees Services Association – TRESA) కార్యాలయంలో నిర్వహించిన 2026 డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గత రెండేళ్లలో రాష్ట్రంలో ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో భ్రష్టుపట్టిన రెవెన్యూ వ్యవస్థను సంస్కరించి, గ్రామ స్థాయి వరకు ప్రజలకు ఉపయోగపడేలా బలోపేతం చేశామని అన్నారు.

రాష్ట్రంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న భూవివాదాలకు శాశ్వత పరిష్కారం లక్ష్యంగా ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి పోర్టల్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. భూ సమస్యల పరిష్కారంలో ఇది గేమ్‌చేంజర్‌గా మారిందన్నారు.

తెలంగాణ రైతుల భూములకు సంబంధించి అత్యంత కీలకమైన సర్వే విభాగాన్ని బలోపేతం చేసేందుకు ఇప్పటికే 3500 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లను నియమించామని, మరో వారం రోజుల్లో అదనంగా 3000 మందిని తీసుకోబోతున్నామని మంత్రి వెల్లడించారు.

ప్రభుత్వ ఉద్యోగులకు అందాల్సిన ప్రయోజనాల్లో కొంత ఆలస్యం రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల కారణంగా జరుగుతున్నప్పటికీ, వాటిని దశలవారీగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో
ట్రెస్సా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Buzznewsline
Buzznewsline
BuzzNewsline is a next-gen digital media platform delivering real-time news, trending stories, and deep insights across sports, politics, entertainment, tech, and more — all in one place.”

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles