Gambheerpur ZP High School: కథలాపూర్ మండలం గంభీర్‌పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీ
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీర్‌పూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆకస్మికంగా సందర్శించి పలు అంశాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా పాఠశాలలో
బోధన విధానం,
విద్యార్థుల హాజరు,
మధ్యాహ్న భోజన పథకం అమలు,
మౌలిక వసతులు
వంటి అంశాలను సవివరంగా పరిశీలించారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ సూచించారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులను పాఠ్యాంశాలకు సంబంధించిన సిలబస్ గురించి అడిగి తెలుసుకుని, వారితో ముఖాముఖి సంభాషణ జరిపారు. విద్యార్థులతో కలిసి పాఠాలు చదివించి వారి అభ్యాస స్థాయి, బోధన స్థితిగతులను ప్రత్యేకంగా పరిశీలించారు.
విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు మరియు ఇతర నైపుణ్యాల్లో కూడా రాణించాలని కలెక్టర్ ప్రోత్సహించారు.
అలాగే 26వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన ఆటల పోటీల్లో జిల్లా కలెక్టర్ స్వయంగా పాల్గొని, విద్యార్థులతో కలిసి ఆటలు ఆడి వారిని ఉత్సాహపరిచారు. కలెక్టర్ పాల్గొనడం విద్యార్థుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


