Tribal Bhavan Construction: జిల్లా కలెక్టర్ అనుదీప్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఖమ్మం నగరంలోని ఎన్ఎస్పీ క్యాంప్ పరిధిలో నిర్మాణంలో ఉన్న గిరిజన భవనం, అలాగే ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న ఆర్ & బీ గెస్ట్ హౌజ్ ను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి తో కలిసి శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా భవనాల ప్రస్తుత పరిస్థితులను కలెక్టర్ పరిశీలించి, అవసరమైన అభివృద్ధి పనులను త్వరితగతిన చేపట్టి పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రజా అవసరాలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వ భవనాలను సద్వినియోగం చేయాలని, పెండింగ్ పనులు ఉంటే వెంటనే పూర్తి చేయాలని, మౌలిక వసతులు మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


