Nampally Multi Level Parking: పీపీపీ విధానంలో HMRL–నోవామ్ సంయుక్తంగా ఏర్పాటు
హైదరాబాద్: నాంపల్లి కూడలి వద్ద HMRL–నోవామ్ ఆధ్వర్యంలో పీపీపీ (PPP) విధానంలో అత్యాధునిక జర్మన్ టెక్నాలజీతో ఏర్పాటు చేసిన బహుళ అంతస్తుల ఆటోమేటెడ్ పార్కింగ్ సిస్టమ్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రారంభించారు. నగరంలో పెరుగుతున్న వాహనాల సంఖ్యకు అనుగుణంగా పార్కింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఈ ప్రాజెక్ట్ నిలవనుంది.
ఈ కార్యక్రమంలో సహచర మంత్రి అజారుద్దీన్, మేయర్ గద్వాల విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, HMRL సలహాదారు ఎన్వీఎస్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
దేశంలోనే తొలిసారిగా అధునాతన జర్మన్ ఆటోమేటెడ్ మల్టీ లెవల్ పార్కింగ్ టెక్నాలజీని హైదరాబాద్‌లో ప్రవేశపెట్టడం విశేషం. ఈ సందర్భంగా పార్కింగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, ఎంతమంది వాహనాలను పార్క్ చేయవచ్చు, దాని వేగం, భద్రత, సామర్థ్యం వంటి అంశాలను మంత్రులు, అధికారులు పరిశీలించారు.
ఈ మల్టీ పార్కింగ్ సిస్టమ్ ద్వారా తక్కువ స్థలంలో ఎక్కువ వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ రద్దీ తగ్గింపు, నాంపల్లి ప్రాంతంలో రహదారి సౌకర్యాల మెరుగుదల సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు. నగరంలోని ఇతర కీలక ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఆధునాతన పార్కింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు పేర్కొన్నారు
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


