National Road Safety Month 2026: జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు
ఖైరతాబాద్‌లో 2026 జనవరి 1 నుంచి 31 వరకు నిర్వహించనున్న జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల (National Road Safety Month 2026)ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తి, జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్లు (JTCలు), డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్లు (DTCలు), ఆర్టీఏ సభ్యులు నవీన్, సురేష్ లాల్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అధికారులకు స్వయంగా హెల్మెట్లు బహూకరించారు. అలాగే జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలకు సంబంధించిన పోస్టర్లు, వాహనాల స్టిక్కర్లు, విద్యార్థుల అవగాహన పుస్తకాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రజలందరూ రవాణా నియమాలను తప్పనిసరిగా పాటించాలని, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, వాహనదారులు సీటుబెల్ట్ వినియోగించడం అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ద్వారా విద్యార్థులు, యువత, వాహనదారుల్లో అవగాహన పెరిగి ప్రమాదాల నివారణకు దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


