CM Revanth Reddy: సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రారంభం
రాష్ట్ర చరిత్రలో అరుదైన ఘట్టంగా నేడు మేడారంలో వనదేవతల సన్నిధిలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో మేడారం పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
ఖమ్మం పర్యటన అనంతరం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా మేడారం చేరుకోనున్నారు. క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి మేడారంలోనే రాత్రి బస చేయనున్నారు.
సోమవారం ఉదయం 6.30 గంటలకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి మంత్రివర్గ సభ్యులతో కలిసి నూతనంగా నిర్మించిన సమ్మక్క–సారలమ్మ గద్దెలను ప్రారంభించనున్నారు. అనంతరం వనదేవతలకు చీర, సారె, బెల్లంతో మొక్కులు సమర్పించి ఆశీర్వాదం పొందనున్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు తిరిగి బయలుదేరనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
మేడారంలో జరుగుతున్న క్యాబినెట్ భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి, మంత్రులకు గిరిజన సంప్రదాయ వంటకాలతో ప్రత్యేక విందు ఏర్పాటు చేసినట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి సీతక్క వెల్లడించారు. ఈ సమావేశం రాష్ట్ర పరిపాలన వికేంద్రీకరణకు ప్రతీకగా నిలవనుందని ప్రభుత్వం భావిస్తోంది.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


