Ward Reservations: ఆదిలాబాద్ మున్సిపల్ 49 వార్డుల రిజర్వేషన్లు లాటరీ పద్ధతిలో ఖరారు
శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని 49 వార్డుల రిజర్వేషన్లను జిల్లా కలెక్టర్ శ్రీ రాజర్షి షా గారు లాటరీ పద్ధతి ద్వారా నిర్వహించారు.
ఈ సందర్భంగా రిజర్వేషన్ల ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించామని జిల్లా కలెక్టర్ తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో లాటరీ నిర్వహించడం ద్వారా ఎన్నికల ప్రక్రియలో న్యాయసమ్మతత, విశ్వసనీయత కొనసాగించామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీ రాజేశ్వర్ గారు, మున్సిపల్ కమిషనర్ శ్రీ C.V.N. రాజు గారు, డి.ఎల్.పి.ఓ శ్రీ ఫణిందర్ గారు, మున్సిపల్ అధికారులు, ఇతర శాఖల అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


