Nagoba Jatara: మెస్రం వంశీయుల ఇలవేల్పు శ్రీ నాగోబా దేవుని మహాపూజ పవిత్ర దినం
ఆదివాసుల విశ్వాసం, ఆచారాలు, సంస్కృతికి ప్రతీకగా నిలిచిన మెస్రం వంశీయుల ఇలవేల్పు శ్రీ నాగోబా దేవుని మహాపూజ పవిత్ర దినం సందర్భంగా ఆదివాసీ సమాజానికి జిల్లా కలెక్టర్ ఆదిలాబాద్ సాదర స్వాగతం పలికారు.
వేల ఏళ్ల సంప్రదాయాన్ని ప్రతిబింబించే కేస్లాపూర్ నాగోబా జాతర మహోత్సవం పవిత్ర గంగాజల అభిషేకంతో ఘనంగా నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ మహోత్సవం ఆదివాసీ సంస్కృతి, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు.
భక్తులు, ఆదివాసీ సోదరులు, ప్రజలందరూ పెద్ద సంఖ్యలో ఈ జాతరకు విచ్చేసి శ్రీ నాగోబా దేవుని ఆశీస్సులు పొందాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సంప్రదాయాలు, ఆచారాలు, విశ్వాసాలను కాపాడుతూ జాతరను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


