back to top
31.2 C
Hyderabad
Sunday, March 1, 2026
HomeTelangana Newsమున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ | జిల్లా కలెక్టర్ రాజర్షిషా

మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ | జిల్లా కలెక్టర్ రాజర్షిషా

Presiding Officer Training: ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం

జిల్లా కేంద్రం: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షిషా గారు పాల్గొని ఎన్నికల పోలింగ్ విధానం, బాధ్యతలు, ఎన్నికల నిబంధనలు, పారదర్శకతతో ఎన్నికల నిర్వహణ వంటి అంశాలపై పలు కీలక సూచనలు చేశారు.

Follow BuzzNewsline: Twitter (X) | Instagram

పోలింగ్ సమయంలో అప్రమత్తతతో వ్యవహరించాలని, ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని, ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం నిష్పక్షపాతంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.

ఈ శిక్షణ కార్యక్రమంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు హనుమంత్ నాయక్ గారు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్ గారు, మున్సిపల్ కమిషనర్ రాజు గారు, నోడల్ అధికారులు మనోహర్, ఫణిందర్, మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్, మున్సిపల్ అధికారులు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Buzznewsline
Buzznewsline
BuzzNewsline is a next-gen digital media platform delivering real-time news, trending stories, and deep insights across sports, politics, entertainment, tech, and more — all in one place.”

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles