Trishool Enterprises donation: మెడిసిన్స్‌ను టీటీడీ ఆసుపత్రుల్లో భక్తుల సేవకు వినియోగించనున్నారు.
తిరుమల: టీటీడీకి తొలిసారిగా భారీ మొత్తంలో రూ.78 లక్షల విలువైన ఔషధాలు విరాళంగా అందాయి. హైదరాబాద్‌కు చెందిన త్రిశూల్ ఎంటర్‌ప్రైజెస్(Trishool Enterprises donation) ప్రోప్రైటర్లు శ్రీ చక్రధర్, శ్రీమతి శివరంజని తరపున ఈ ఔషధాలను టీటీడీ బోర్డు సభ్యుడు శ్రీ నన్నపనేని సదాశివరావు గారు టీటీడీకి అందజేశారు.
ఇంత పెద్ద మొత్తంలో ఔషధాలు టీటీడీకి విరాళంగా అందడం ఇదే తొలిసారి కావడం విశేషం. విరాళంగా వచ్చిన ఈ మెడిసిన్స్‌ను టీటీడీ కేంద్రీయ వైద్యశాల, బర్డ్ (BIRRD) మరియు స్విమ్స్ (SVIMS) ఆసుపత్రుల్లో భక్తుల వైద్య సేవల కోసం వినియోగించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
భక్తుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఈ విరాళం ఎంతో ఉపయోగపడుతుందని టీటీడీ అధికారులు పేర్కొంటూ, ఔషధాలు విరాళంగా అందించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


