Vasant Panchami celebrations: శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో వసంతపంచమి మహోత్సవాలు
ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు బాసరలోని ప్రఖ్యాత శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో వసంతపంచమి మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్న నేపథ్యంలో ఆలయ ఆహ్వాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారు, ఆలయ కార్యనిర్వాహక అధికారి (ఈవో), బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయ అర్చకులు కలిసి వసంతపంచమి మహోత్సవాలకు సంబంధించిన అధికారిక ఆహ్వానాన్ని అందించారు.
ఆలయ పండితులు ఈ సందర్భంగా మంత్రికి ఆశీర్వచనాలు అందించి, మహోత్సవాలు విజయవంతంగా జరగాలని ప్రార్థించారు. వసంతపంచమి సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
విద్యకు అధిదేవతైన శ్రీ జ్ఞాన సరస్వతి దేవిని వసంతపంచమి రోజున దర్శించుకుంటే విద్యా బుద్ధులు ప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం ఉండటంతో, రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు బాసరకు తరలివస్తారని తెలిపారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


