back to top
31.2 C
Hyderabad
Sunday, March 1, 2026
HomeTelangana Newsవరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో వార్షిక ఫైరింగ్ సాధనలో పాల్గొన్న పోలీస్ అధికారులు

వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో వార్షిక ఫైరింగ్ సాధనలో పాల్గొన్న పోలీస్ అధికారులు

Firing Practice: వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో వార్షిక ఫైరింగ్ సాధన కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆర్మ్డ్ రిజర్వ్ విభాగానికి చెందిన పోలీస్ సిబ్బందితో పాటు శాంతి భద్రతల విభాగానికి చెందిన పోలీస్ అధికారులు గత రెండు రోజులుగా ధర్మసాగర్ మండల కేంద్రం శివారులో ఉన్న వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఫైరింగ్ రేంజ్‌లో ఫైరింగ్ సాధనలో పాల్గొన్నారు.

Follow BuzzNewsline: Twitter (X) | Instagram

ఈ ఫైరింగ్ సాధన కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ శ్రీ సన్‌ప్రీత్ సింగ్ గారితో పాటు డిసిపిలు, అదనపు డిసిపిలు, ఏసిపిలు, ఆర్‌.ఐలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌.ఐలు వివిధ రకాల తుపాకులతో సాధన చేశారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ గారు, భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని ఫైరింగ్ సాధనకు మరింత అనుకూలంగా అభివృద్ధి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత పోలీస్ అధికారులతో చర్చించారు. అలాగే ఫైరింగ్ సాధనలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు, సిబ్బందికి రివార్డులు అందజేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిసిపిలు అంకిత్ కుమార్, దార కవిత, రాజమహేంద్ర నాయక్, ఏఎస్పీలు చేతన్, శుభం, ట్రైనీ ఐపిఎస్ మనీషా నేహ్రా, అదనపు డిసిపిలు సురేష్ కుమార్, రవి, రాయల ప్రభాకర్ రావు, శ్రీనివాస్, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Buzznewsline
Buzznewsline
BuzzNewsline is a next-gen digital media platform delivering real-time news, trending stories, and deep insights across sports, politics, entertainment, tech, and more — all in one place.”

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles