Nalgonda Municipal Corporation: నల్లగొండను అన్ని మౌలిక వసతులతో కూడిన ఆధునిక నగరంగా అభివృద్ధి చేస్తాం: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నల్లగొండ:నల్లగొండను అన్ని మౌలిక వసతులు కలిగిన ఆధునిక నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేశామని రాష్ట్ర మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
నగర అభివృద్ధికి ప్రభుత్వం విస్తృతంగా కృషి చేస్తోందని పేర్కొన్న ఆయన, రోడ్లు, త్రాగునీరు, డ్రైనేజ్, పారిశుధ్యం, విద్యుత్, పచ్చదనం వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. నల్లగొండ నగరాన్ని ప్రజలకు మరింత సౌకర్యవంతంగా, జీవన ప్రమాణాలు మెరుగుపడేలా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను గెలిపించి నగర సమగ్ర అభివృద్ధికి సహకరించాలని ప్రజలను ఆయన కోరారు. ప్రజల మద్దతుతోనే నల్లగొండను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దగలమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


