back to top
31.2 C
Hyderabad
Sunday, March 1, 2026
HomeTelangana Newsప్రజల రక్షణ కోసం 24x7 పనిచేస్తాం – వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్

ప్రజల రక్షణ కోసం 24×7 పనిచేస్తాం – వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్

Warangal Police: ప్రజల రక్షణ కోసం 24×7 పనిచేస్తాం 

వరంగల్: సమాజ రక్షణే పోలీసుల ప్రధాన ధ్యేయమని, ప్రజల భద్రత కోసం 24×7 సేవలందించాల్సి ఉంటుందని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, IPS స్పష్టం చేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులకు పదిహేను రోజుల పాటు నిర్వహించిన పున:శ్చరణ (రిఫ్రెషర్) శిక్షణ తరగతులు శనివారం విజయవంతంగా ముగిశాయి.

Follow BuzzNewsline: Twitter (X) | Instagram

ఈ శిక్షణ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, సాయుధ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, సిబ్బంది నిర్వహించిన పోలీస్ పరేడ్‌ను తిలకించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిరంతర సాధన ద్వారా విధుల్లో మరింత మెరుగ్గా రాణించవచ్చని అన్నారు. పున:శ్చరణ శిక్షణ తరగతుల్లో నేర్చుకున్న అంశాలపై సిబ్బంది పూర్తి స్థాయిలో పట్టు సాధించాలని సూచించారు. శిక్షణలో వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి త్వరలో రివార్డులు అందజేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సెంట్రల్ డీసీపీ దార కవిత, అదనపు డీసీపీలు రవి, సురేష్ కుమార్, శ్రీనివాస్, ట్రైనీ ఐపీఎస్ మనీషా నెహ్ర, ఏసీపీలు జితేందర్ రెడ్డి, నాగయ్య, సురేంద్ర, అంతయ్య, ఆర్‌ఐలు సతీష్, చంద్రశేఖర్, శ్రీధర్తో పాటు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Buzznewsline
Buzznewsline
BuzzNewsline is a next-gen digital media platform delivering real-time news, trending stories, and deep insights across sports, politics, entertainment, tech, and more — all in one place.”

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles