Amit Shah Nirmal Visit: నిర్మల్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాక
నిర్మల్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా త్వరలో నిర్మల్‌కు రానున్నట్లు బీజేపీ ఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఇంచార్జి అభయ్ పాటిల్ గారితో కలిసి ఆయన సభ ఏర్పాట్లను పరిశీలించారు.
అమిత్ షా పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో భాగంగా, సభ ప్రాంగణం, హెలిప్యాడ్ ల్యాండింగ్ ప్రదేశాలు తదితర కీలక ప్రాంతాలను పరిశీలించి, అవసరమైన సూచనలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని లక్ష్యంగా పెట్టుకొని ఈ సభ నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు బస్వపురం లక్ష్మీ నర్సయ్య, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్, సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, బీజేపీ జిల్లా, పట్టణ, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అమిత్ షా పర్యటనతో నిర్మల్ జిల్లాలో బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొనగా, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయానికి ఈ సభ కీలకంగా మారనుందని నాయకులు అభిప్రాయపడ్డారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


