Young India Residential Schools: ప్రతి నియోజకవర్గంలో ‘యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు’
సమాజంతో పోటీ పడాలంటే జ్ఞానం అవసరం, ఆ జ్ఞానం విద్య ద్వారానే సాధ్యమవుతుందని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. పేదలకు నాణ్యమైన విద్య అందించాలనే సంకల్పంతోనే ప్రతి నియోజకవర్గంలో ‘యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు’ ఏర్పాటు చేయడానికి ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఆయన స్పష్టం చేశారు.
పేద కుటుంబాల పిల్లలకు విద్య అందితేనే వారు జీవితంలో ముందుకు సాగగలరని, సమాజంలో సమాన అవకాశాలు పొందగలరని సీఎం అన్నారు. ఉచిత విద్య ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, పోటీ తత్వం పెరుగుతుందని, రాష్ట్ర భవిష్యత్తు మరింత బలపడుతుందని పేర్కొన్నారు.
యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల ద్వారా పేద విద్యార్థులకు నాణ్యమైన బోధన, వసతి, భోజనం వంటి సౌకర్యాలు అందించడమే లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యనే ఆయుధంగా చేసుకుని తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలన్నదే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని ఆయన అన్నారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


