Jammikunta Degree College: స్టేడియం మరియు సింథటిక్ ట్రాక్ నిర్మాణానికి కేంద్రం మంజూరు
జమ్మికుంట :జమ్మికుంట డిగ్రీ అండ్ పీజీ కాలేజీ ప్రాంగణంలో స్టేడియం మరియు సింథటిక్ ట్రాక్ నిర్మాణానికి కేంద్రంలోని గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రూ.6.5 కోట్ల నిధులు మంజూరు చేయడం హర్షణీయమని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో, స్థానిక ఆర్డీవో, తహసీల్దార్, కాలేజీ ప్రిన్సిపాల్‌తో కలిసి ప్రతిపాదిత స్టేడియం నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం స్టేడియం, సింథటిక్ ట్రాక్ నిర్మాణానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై కాలేజీ ప్రిన్సిపాల్, సిబ్బందితో సమావేశం నిర్వహించి, వారి సూచనలు, అభిప్రాయాలను సేకరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ,
“కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మాదిరిగా మోదీ గారిది మాటల ప్రభుత్వం కాదు.. పనిచేసే ప్రభుత్వం. స్టేడియం, సింథటిక్ ట్రాక్ నిర్మాణానికి ప్రతిపాదనలు అందిన వెంటనే కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది” అని స్పష్టం చేశారు.
నిధుల మంజూరు అనంతరం వెంటనే టెండరు ప్రక్రియ పూర్తి చేసి, పనులు కూడా ప్రారంభిస్తామని తెలిపారు. ఈ స్టేడియం నిర్మాణంతో జమ్మికుంట ప్రాంతంలోని విద్యార్థులు, యువతకు క్రీడా రంగంలో మెరుగైన అవకాశాలు లభించడంతో పాటు, ప్రతిభావంతులైన క్రీడాకారులు వెలుగులోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


