Congress Campaign: ఘనపూర్‌కు అదనంగా రూ.50 కోట్లు – ప్రజాప్రభుత్వ హామీ
రెండేళ్ల క్రితం ఏర్పడిన ప్రజాప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు రైతులకు భరోసా, పేదలకు భద్రత, యువతకు ఉపాధి, మహిళలకు గౌరవం, విద్య–వైద్య రంగాలకు ప్రాధాన్యత వంటి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.
ఈరోజు తొర్రూర్, వర్ధన్నపేట మున్సిపాలిటీలలో ఎన్నికల ప్రచారాన్ని ముగించిన అనంతరం జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్, జనగాం మున్సిపాలిటీలలో ఎంపీలు కడియం కావ్య, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, సీనియర్ నాయకుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి తదితరులతో కలిసి రోడ్ షో నిర్వహించారు.
స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ
స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీలో 18 వార్డులు, జనగాంలో 30 వార్డులు ఉన్నాయి. అన్ని వార్డుల్లో కాంగ్రెస్ మరియు మిత్రపక్షాలు సిపిఎం, సిపిఐ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ఘనపూర్ అభివృద్ధి కోసం అదనంగా రూ.50 కోట్లు మంజూరు చేయించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ఇప్పటికే ఘనపూర్‌లో 300, జనగాంలో 600 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా, రెండో విడతలో అదనంగా మరో 1000 ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
జనగాం మున్సిపాలిటీ
జనగాంలో గతంలో బీఆర్ఎస్ నేత దొంగ ఓట్లతో గెలిచారని ఆరోపించారు. ప్రస్తుతం రూ.30 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. సిడిఎఫ్ ఫండ్ రూ.10 కోట్లలో పట్టణానికి రూ.3.5 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.
సర్వే నెంబర్ 53లో 230 ఎకరాల్లో 1800 మంది పేదలు నివసిస్తున్నారని, వారి ఇండ్ల క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
రూ.1.50 కోట్లతో బతుకమ్మ కుంట అభివృద్ధి చేసినట్లు, రంగప్ప చెరువు అభివృద్ధి, రోడ్లు, డ్రైన్లు, బ్రిడ్జిలు, లింక్ రోడ్లు, హైటెన్షన్ విద్యుత్ తీగల తొలగింపు వంటి పనులు చేపడతామని తెలిపారు.
ఎన్నికల పిలుపు
మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధి కోసం ఫిబ్రవరి 11న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ తీర్పుతో ప్రత్యర్థులకు సరైన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
మరిన్ని Telangana Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


