Adilabad Bandh: బీఆర్ఎస్ నిరసన, జోగు రామన్న అరెస్ట్
ఆదిలాబాద్: సోయా రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లాలో బంద్ నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సోయా కొనుగోలు చేస్తామని చెప్పి రైతులను మోసం చేశాయని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
బంద్ నేపథ్యంలో ఆదిలాబాద్ బస్ డిపో ఎదుట మాజీ మంత్రి జోగు రామన్న, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్తో పాటు బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సోయా కొనుగోలు హామీలను అమలు చేయకుండా రైతులను నష్టపరిచారని జోగు రామన్న మండిపడ్డారు. రైతులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
నిరసన కొనసాగుతుండగా పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జోగు రామన్నను అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు పోలీస్ వాహనానికి అడ్డుపడి సోయా కొనుగోలు చేయాలంటూ నినాదాలు చేశారు.
ఈ ఘటనతో ఆదిలాబాద్‌లో ఉద్రిక్తత నెలకొంది.
మరిన్ని Telangana Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


