Indur Municipal Elections: కమలం గుర్తుకే ఓటు వేయాలి – అర్వింద్ ధర్మపురి
ఇందూర్: ఇందూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్యనగర్ హనుమాన్ దేవాలయం వద్ద నిర్వహించిన సభలో బీజేపీ ఎంపీ శ్రీ అర్వింద్ ధర్మపురి పాల్గొని, 4వ డివిజన్ అభ్యర్థి వీరమాచినేని ప్రమోద్, 5వ డివిజన్ అభ్యర్థి యాదల నరేష్ గార్లకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. బీజేపీ పాలనలోనే అభివృద్ధి, పారదర్శకత మరియు ప్రజలకు నిజమైన సేవ జరుగుతుందని అన్నారు.
ఇందూర్ పట్టణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు, నిధులు అందిస్తోందని, బీజేపీ కౌన్సిలర్లు గెలిస్తే పట్టణ అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, BJYM రాష్ట్ర అధ్యక్షులు గణేష్, ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మరిన్ని Telangana Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


