Karimnagar Municipal Elections: బల్దియాపై కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యం – బండి సంజయ్ కుమార్
కరీంనగర్: మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ బల్దియాపై కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర నాయకుడు శ్రీ బండి సంజయ్ కుమార్ రాంనగర్ సత్యనారాయణ స్వామి గుడి చౌరస్తా, కమాన్ చౌరస్తాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన 46వ డివిజన్ అభ్యర్థి అఖిల్ గౌడ్, 47వ డివిజన్ అభ్యర్థి గాజె రమా శివరాం, 38వ డివిజన్ అభ్యర్థి దేవసాని సరస్వతి, 56వ డివిజన్ అభ్యర్థి తాటి ప్రభావతి, 57వ డివిజన్ అభ్యర్థి కొలిపాక రమ్యశ్రీ గార్లకు మద్దతుగా ప్రజలను ఓటు వేయాలని కోరారు.
బండి సంజయ్ మాట్లాడుతూ,
కరీంనగర్‌లో ప్రతి వాడలో జరిగిన అభివృద్ధి పనులన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్మార్ట్ సిటీ నిధులతోనే జరిగాయని తెలిపారు. కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే వరదల్లా నిధులు తీసుకువచ్చే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను గెలిపిస్తే అభివృద్ధి జరగదని, ప్రజలు సమస్యలతోనే మిగిలిపోతారని విమర్శించారు. కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధి కోసం ఇప్పటివరకు రూ.1500 కోట్ల నిధులు తీసుకువచ్చామని, భవిష్యత్తులో మరిన్ని నిధులు తెస్తామని స్పష్టం చేశారు.
బీజేపీ అభ్యర్థులు గుణవంతులని, ప్రజల సమస్యలపై పోరాడే నాయకులని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు కబ్జాలు, దోపిడీలకే పరిమితమయ్యారని ఆరోపించారు. కరీంనగర్ అభివృద్ధి కోసం బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.
మరిన్ని Telangana Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


