BJP Election Campaign: బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం – ప్రజలకు హామీ
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని సైదోనిగడ్డ తండాలో బీజేపీ అభ్యర్థులు శ్రీమతి మెగావత్ శాంతి జీవన్ నాయక్, శ్రీమతి అంకిత రవి నాయక్ గారికి మద్దతుగా ఘనంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, తమ 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజల కోసం సాధ్యం కాదు అని ఏ పనినీ వదిలిపెట్టలేదని, ఎంత కష్టమైనా ప్రజాసేవ కోసం ముందుంటామని స్పష్టం చేశారు. స్థానికంగా గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒక్క పని కూడా చేయలేకపోతున్నానని చెబుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేనే పనిచేయలేకపోతే, రేపు వార్డు కౌన్సిలర్ ఏమి చేయగలడని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై తీవ్ర విమర్శలు చేశారు. ఉచిత బస్సు ప్రయాణం తప్ప 2000 పెన్షన్ 4000 చేస్తామన్న హామీ, 4000ను 6000 చేస్తామన్న హామీ, ప్రతి మహిళకు రూ.2500 ఇస్తామన్న వాగ్దానం ఏదీ అమలు కాలేదన్నారు. గత రెండేళ్లలో భర్తలు చనిపోయినవారికి, వికలాంగులకు ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు కాలేదని ఆరోపించారు.
అలాగే రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ రావడం లేదని, పనిచేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. తెలంగాణకు వచ్చే అభివృద్ధి నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తున్నాయని, అమృత్ నగరాలు, స్మార్ట్ సిటీ పథకాల ద్వారా పట్టణాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నదీ బీజేపీ ప్రభుత్వమేనని పేర్కొన్నారు.
బీజేపీని గెలిపిస్తే సాధ్యమైనంత ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తూ, కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ నారెడ్డి నందా రెడ్డి, శ్రీ జగన్, శ్రీ పూడూరు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సేవాలాల్ మహారాజ్ కీ జై!
జగదాంబ మాతాకీ జై!
మరిన్ని Telangana Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


