Arvind Dharmapuri: బీజేపీ మాజీ కార్పొరేటర్లతో ఆత్మీయ సమావేశం
ఇందూరు నగరంలోని అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన BJP Telangana 28 మంది తాజా మాజీ కార్పొరేటర్లతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు నిజామాబాద్ ఎంపీ శ్రీ అరవింద్ ధర్మపురి గారు.
ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్లతో కలిసి భోజనం చేయడం ఎంతో ఆనందంగా ఉందని అరవింద్ ధర్మపురి తెలిపారు. నగరాభివృద్ధి, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, రాబోయే రాజకీయ కార్యాచరణపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది.
ఈ కార్యక్రమంలో
ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా గారు,
జాతీయ పసుపు బోర్డు చైర్మన్ శ్రీ పల్లె గంగారెడ్డి గారు,
రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి స్రవంతి రెడ్డి గారు,
జిల్లా అధ్యక్షులు శ్రీ దినేష్ కులాచారి గారు
పాల్గొని పార్టీ కార్యకలాపాలపై కీలక సూచనలు చేశారు.
మాజీ కార్పొరేటర్లు పార్టీకి బలమైన పునాదులని, ప్రజలతో అనుసంధానంగా పనిచేస్తూ బీజేపీని ఇందూరు నగరంలో మరింత బలోపేతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
మరిన్ని Telangana Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


