Edulapuram Municipality : 32 వార్డులకు 32 కాంగ్రెస్ సీట్లు ఖాయం: పొంగులేటి శ్రీనివాస రెడ్డి
ఏదులాపురం: ఏదులాపురం మున్సిపాలిటీలో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానుల్లో కనిపిస్తున్న ఉత్సాహాన్ని చూస్తుంటే తప్పకుండా 32 వార్డులకు 32 వార్డులు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందన్న పూర్తి విశ్వాసం ఉందని కాంగ్రెస్ నాయకులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.
శుక్రవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 3, 4, 5, 6, 25వ వార్డుల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కాంగ్రెస్ అభ్యర్థులతో కలిసి వేలాది మంది కార్యకర్తలు, అభిమానుల మధ్య విస్తృతంగా పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు.
మున్సిపాలిటీలో గత రెండేళ్లలో వందల కోట్ల నిధులతో కనీవినీ ఎరగని రీతిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, కేవలం ఈ వార్డుల అభివృద్ధి కోసమే రూ.19 కోట్ల 74 లక్షలు ఖర్చు చేశామని తెలిపారు.
అదేవిధంగా రూ.680 కోట్లతో చేపట్టిన మున్నేరు రక్షణ గోడ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి వచ్చే వర్షాకాలానికి ప్రజలకు పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. మున్నేరు నది వెంట మూడు ఘాట్లు ఏర్పాటు, ఎఫ్‌సీఐ గోడౌన్ తరలింపు, అలాగే అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా అమలవుతూ ప్రజా ప్రభుత్వం ప్రగతిపథంలో ముందుకు సాగుతోందన్నారు.
ఎన్నికలు రాగానే ప్రత్యర్థులు మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారని హెచ్చరించిన పొంగులేటి, పదేళ్లు అధికారంలో ఉండి పేదవాడికి ఒక్క ఇల్లు కూడా ఇవ్వని వారు ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతున్నారో ప్రజలు గుర్తించాలని అన్నారు.
ఈ సందర్భంగా
-
3వ వార్డు – వెలుగు సైదమ్మ,
-
4వ వార్డు – బోయిన కుమారి,
-
5వ వార్డు – భానోత్ నాగేంద్ర ప్రసాద్,
-
6వ వార్డు – వేమిరెడ్డి శివాదేవి,
-
25వ వార్డు – కడవ నవీన్ కుమార్
గార్లకు హస్తం గుర్తుపై ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
పేదల కష్టం తెలిసిన మీ ఇంటి పెద్ద కొడుకులా ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని మున్సిపాలిటీ ప్రజలకు హామీ ఇచ్చారు.
మరిన్ని Telangana Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


