Kyatanapalli Municipality: ఈ నెల 3న సీట్ల ఖరారు – సమన్వయంతో చైర్‌పర్సన్ స్థానం కైవసం చేస్తాం
క్యాతనపల్లి / రామకృష్ణాపూర్:
క్యాతనపల్లి మున్సిపాలిటీలో రానున్న ఎన్నికల్లో సిపిఐ మరియు బీఆర్ఎస్ పార్టీలు కలిసి పోటీ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ నెల మూడవ తేదీన పార్టీల వారీగా సీట్ల ఖరారు చేయనున్నట్లు వెల్లడించారు.
రామకృష్ణాపూర్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని చెన్నూరు మాజీ శాసనసభ్యులు బాల్క సుమన్ గారు అధికారికంగా ప్రకటించారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ గారు, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, ఇరు పార్టీలు సమన్వయంతో పనిచేసి క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్‌పర్సన్ స్థానాన్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కార్మిక వర్గ హితమే లక్ష్యంగా ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగుతామని తెలిపారు.
అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న కార్మిక వ్యతిరేక విధానాల వల్ల సింగరేణి సంస్థ ఉనికే ప్రమాదంలో పడుతోందని నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సింగరేణిలో అధిక రాజకీయ జోక్యం పెరిగిందని, పదుల సంఖ్యలో స్కాముల ద్వారా సంస్థను బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.
కార్మికుల హక్కుల రక్షణ, సింగరేణి పరిరక్షణ కోసం సిపిఐ–బీఆర్ఎస్ కలిసి పోరాటం చేస్తాయని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
మరిన్ని Telangana Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


