back to top
31.2 C
Hyderabad
Sunday, March 1, 2026
HomeTelangana Politicsఎల్లంపేట మున్సిపల్ బీజేపీ కార్యకర్తల సమావేశం | మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించాలి ఈటల రాజేందర్

ఎల్లంపేట మున్సిపల్ బీజేపీ కార్యకర్తల సమావేశం | మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించాలి ఈటల రాజేందర్

Ellampet Municipal BJP: ఎల్లంపేట మున్సిపల్ బీజేపీ కార్యకర్తల సమావేశంలో పిలుపునిచ్చిన ఈటల రాజేందర్

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఎల్లంపేట మున్సిపల్ పరిధిలో నిర్వహించిన బీజేపీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఈటల రాజేందర్ పాల్గొని ప్రసంగించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధించాలని, అందుకు ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు.

Follow BuzzNewsline: Twitter (X) | Instagram

మంచి అభ్యర్థులను, ప్రజలతో అనుసంధానం ఉన్న నాయకులను ఎంపిక చేసుకోవాలని అన్నారు. రాజకీయాలను డబ్బు మయం చేసిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలను ప్రజలు గుర్తిస్తున్నారని, ఫ్లెక్సీలు గానీ హంగామా గానీ ఎన్నికల్లో గెలిపించవని వ్యాఖ్యానించారు. చాపకింద నీరులా ప్రజల ప్రేమను సంపాదించుకోవడమే బీజేపీ బలం అని స్పష్టం చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 11 ఏళ్లుగా ఒక్క కుంభకోణం లేకుండా దేశం గర్వపడే పాలన సాగుతోందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతోనే గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతుల నిర్మాణం జరుగుతోందని చెప్పారు. రైల్వే అండర్‌బ్రిడ్జిలు, ఆర్వోబీలు, సీసీ రోడ్లు, కాలువలు, అంగన్‌వాడీ భవనాలు, స్మశాన వాటికలు అన్నీ కేంద్ర నిధులతోనే సాధ్యమవుతున్నాయని తెలిపారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండేళ్లలోనే ప్రజల్లో నమ్మకం కోల్పోయిందని విమర్శించారు. బిల్లులు రాక కాంట్రాక్టర్లు టెండర్లకు ముందుకు రావడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.

మల్కాజిగిరి నియోజకవర్గం రాష్ట్రంలోనే బీజేపీ బలంగా ఉన్న నియోజకవర్గమని పేర్కొంటూ, ప్రజలకు పార్టీ కమిట్‌మెంట్‌ను వివరించి ఓట్లు అడగాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి నాయకులు, సీనియర్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

భారత్ మాతా కీ జై.. జై శ్రీరామ్..

మరిన్ని Telangana Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Buzznewsline
Buzznewsline
BuzzNewsline is a next-gen digital media platform delivering real-time news, trending stories, and deep insights across sports, politics, entertainment, tech, and more — all in one place.”

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles