back to top
31.2 C
Hyderabad
Sunday, March 1, 2026
HomeTelangana Politicsజిల్లాల రద్దు, సింగరేణి మెడికల్ బోర్డు రద్దుపై తప్పుడు ప్రచారం – సీఎం రేవంత్ రెడ్డి...

జిల్లాల రద్దు, సింగరేణి మెడికల్ బోర్డు రద్దుపై తప్పుడు ప్రచారం – సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ

District Abolition Campaign: “ప్రజా పాలన – ప్రగతి బాట” కార్యక్రమం

భూపాలపల్లి: కొన్ని జిల్లాలను రద్దు చేస్తారంటూ, సింగరేణి మెడికల్ బోర్డును రద్దు చేస్తారంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి స్వయంగా స్పష్టతనిచ్చారు. ఏ జిల్లాను తొలగించడం గానీ, కొత్త జిల్లాను ఏర్పాటు చేయడం గానీ ప్రభుత్వ పరిశీలనలో లేదని ఆయన స్పష్టం చేశారు.

Follow BuzzNewsline: Twitter (X) | Instagram

“ప్రజా పాలన – ప్రగతి బాట” కార్యక్రమంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూరు గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. జిల్లాల విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలకు ముందుగానే వెల్లడించి, శాసనసభలో చర్చించి, ప్రతిపక్షాల సూచనలు స్వీకరించిన తరువాతే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తారంటూ జరుగుతున్న విష ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ, భూపాలపల్లి ప్రజలు చైతన్యవంతులని, తప్పుడు ప్రచారాలను గుర్తించే శక్తి వారికి ఉందని పేర్కొన్నారు. భూపాలపల్లిని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

సింగరేణి మెడికల్ బోర్డు రద్దుపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు సింగరేణి పరీవాహక ప్రాంతంలో వేలాది కార్మిక కుటుంబాలు ఉన్నాయని, వారి ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోదని అన్నారు. కార్మికులకు నష్టం కలిగే నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోదని, సింగరేణి గని కార్మికులు ప్రభుత్వానికి అండగా నిలిచారని గుర్తుచేశారు.

2027లో నిర్వహించనున్న గోదావరి పుష్కరాల సందర్భంగా బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాలను పర్యాటక పుణ్యక్షేత్రాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. అటవీ ప్రాంతాల్లో రిసార్టులు నిర్మించి పర్యాటక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. గతేడాది సరస్వతి పుష్కరాలు విజయవంతంగా నిర్వహించామని, మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు 2 కోట్ల మంది హాజరైనట్లు వెల్లడించారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల కోసం రూ. 6,116 కోట్లను కేటాయించినట్లు తెలిపారు. ఈ సభ వేదికగా ‘సమ్మక్క–సారలమ్మ జిల్లా మహిళా సమాఖ్య’కు రూ. 205 కోట్ల బ్యాంకు లింకేజీ చెక్కును అందజేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ , కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని Telangana Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Buzznewsline
Buzznewsline
BuzzNewsline is a next-gen digital media platform delivering real-time news, trending stories, and deep insights across sports, politics, entertainment, tech, and more — all in one place.”

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles