back to top
31.2 C
Hyderabad
Sunday, March 1, 2026
HomeTelangana Politicsమినీ మేడారం జాతరలో ఎమ్మెల్యే అక్రమ అరెస్ట్ – స్పీకర్‌కు ప్రివిలైజ్ మోషన్ | పాడి...

మినీ మేడారం జాతరలో ఎమ్మెల్యే అక్రమ అరెస్ట్ – స్పీకర్‌కు ప్రివిలైజ్ మోషన్ | పాడి కౌశిక్ రెడ్డి

మినీ మేడారం జాతరలో ఎమ్మెల్యే అక్రమ అరెస్ట్‌పై స్పీకర్‌కు ప్రివిలైజ్ మోషన్

Padi Kaushik Reddy: దానం నాగేందర్‌పై వెంటనే అనర్హత వేటు వేయాలి 

హుజురాబాద్ / కరీంనగర్: వీణవంక మండలంలో నిన్న నిర్వహించిన మినీ మేడారం సమ్మక్క–సారక్క జాతర సందర్భంగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం అత్యంత బాధాకరమని ఆయన తీవ్రంగా ఖండించారు.

Follow BuzzNewsline: Twitter (X) | Instagram

కరీంనగర్ జిల్లా సీపీ, ఏసీపీ, సీఐలు కలిసి ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా, చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తూ పవిత్రమైన ఆదివాసీ దేవతల జాతరలో ప్రజలతో కలిసి పాల్గొంటున్న తనను అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన శాసనసభ్యుడిపై అధికార పార్టీ ఒత్తిడితో పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు.

ఈ ఘటన శాసనసభ హక్కులను, ప్రజాప్రతినిధుల గౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీసే విధంగా ఉందని పేర్కొంటూ, బాధ్యులైన అధికారులపై ప్రివిలైజ్ ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు గౌరవ స్పీకర్ గారికి శాసనసభలో ప్రివిలైజ్ మోషన్ సమర్పించామని ఎమ్మెల్యే తెలిపారు.

పవిత్రమైన సమ్మక్క–సారక్క జాతరను రాజకీయ ప్రయోజనాల కోసం భంగపెట్టడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. అధికార పార్టీ అండదండలతో కరీంనగర్ సీపీ, హుజురాబాద్ ఏసీపీ, జమ్మికుంట రూరల్ సీఐలు చట్టాన్ని కాలరాస్తూ ఎమ్మెల్యే హక్కులను ఉల్లంఘిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు.

రాబోయే మూడేళ్లలో రాష్ట్రంలో తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని, అప్పుడు చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులందరికీ చట్టప్రకారం గట్టి బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై ఈరోజు విచారణ జరగగా, టీఆర్ఎస్ పార్టీ తరఫున తాను హాజరయ్యానని తెలిపారు. అయితే పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, అలాగే విచారణ ఎదుర్కొంటున్న దానం నాగేందర్ హాజరు కాకపోవడం ద్వారా బీజేపీ–కాంగ్రెస్ పార్టీల మధ్య తెరవెనుక రాజకీయ ఒప్పందాలు ప్రజలకు స్పష్టంగా కనిపిస్తున్నాయని విమర్శించారు.

దానం నాగేందర్‌తో పాటు మరో పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదని, ఉప ఎన్నికలు రావడం ఖాయమని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో, జిల్లాలో కొంతమంది అధికారులు బీఆర్ఎస్ నాయకులను వేధించడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపిస్తూ, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి తగిన విధంగా గుణపాఠం చెబుతామని గట్టిగా హెచ్చరించారు.

మరిన్ని Telangana Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Buzznewsline
Buzznewsline
BuzzNewsline is a next-gen digital media platform delivering real-time news, trending stories, and deep insights across sports, politics, entertainment, tech, and more — all in one place.”

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles