back to top
31.2 C
Hyderabad
Sunday, March 1, 2026
HomeTelangana Politicsమున్సిపల్ ఎన్నికలపై జనసేన కీలక సమావేశం – శంకర్ గౌడ్ స్పష్టమైన దిశానిర్దేశం

మున్సిపల్ ఎన్నికలపై జనసేన కీలక సమావేశం – శంకర్ గౌడ్ స్పష్టమైన దిశానిర్దేశం

Janasena Party: మున్సిపల్ ఎన్నికలపై స్పష్టమైన దిశానిర్దేశం

హైదరాబాద్: జనసేన పార్టీ కార్యాలయంలో ఈరోజు పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ గారు నాయకులు, వీరమహిళలు, జనసైనికులు, కార్యకర్తలతో కీలక సమావేశం నిర్వహించారు.

Follow BuzzNewsline: Twitter (X) | Instagram

ఈ సమావేశంలో రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ ఎలా పని చేయాలి, ఏ విధమైన ప్రణాళికలతో ముందుకు సాగాలి అనే అంశాలపై స్పష్టమైన మార్గదర్శకత్వం అందించారు.

ఈ సందర్భంగా శంకర్ గౌడ్ గారు మాట్లాడుతూ…
మున్సిపల్ ఎన్నికలు జనసేన పార్టీకి అత్యంత కీలకమైనవి. బూత్ స్థాయి నుంచి వార్డు స్థాయి వరకు బలమైన వ్యవస్థను నిర్మించాలి. ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను నేరుగా వినాలి. జనసేన పార్టీ విధానాలు, గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలి” అని తెలిపారు.

కష్టపడే కార్యకర్తలే పార్టీకి నిజమైన బలమని పేర్కొన్న ఆయన, ప్రజలతో నిరంతర సంబంధం ఉంచుకుంటేనే విజయం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
అలాగే యువత, మహిళలు, వీరమహిళల పాత్ర ఎన్నికల్లో అత్యంత కీలకమని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పని చేసి పార్టీని గెలిపించాలన్నారు.

ఐక్యత, క్రమశిక్షణతో ముందుకు సాగితే జనసేన విజయాన్ని ఎవ్వరూ ఆపలేరని శంకర్ గౌడ్ గారు ధీమా వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో నాయకులు రాధారం రాజలింగం, ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, కావ్య, సిరీష, లిఖిత తదితరులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు.
పెద్దఎత్తున వీరమహిళలు, జనసైనికులు, కార్యకర్తలు హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా రానున్న మున్సిపల్ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సన్నద్ధంగా ఉండాలని, ప్రజాసేవే లక్ష్యంగా పనిచేయాలని స్పష్టమైన దిశ లభించిందని కార్యకర్తలు అభిప్రాయపడ్డారు.

మరిన్ని Telangana Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Buzznewsline
Buzznewsline
BuzzNewsline is a next-gen digital media platform delivering real-time news, trending stories, and deep insights across sports, politics, entertainment, tech, and more — all in one place.”

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles