Janasena Party: సత్తుపల్లిలో జనసేన ఎన్నికల శంఖారావం
“ఈ ఎన్నికల్లో జనసేన సత్తా తప్పక చూపిస్తాం” – మిర్యాల రామకృష్ణ
సత్తుపల్లి: మున్సిపాలిటీ ఎన్నికల సమరానికి Janasena Party అధికారికంగా అడుగులు వేయడంతో సత్తుపల్లి రాజకీయాల్లో కొత్త ఉత్సాహం వెల్లివిరిసింది. రాబోయే ఎన్నికల్లో జనసేన కీలక పాత్ర పోషించబోతుందన్న స్పష్టమైన సంకేతాలు ఈ సమావేశం ద్వారా కనిపించాయి.
సత్తుపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఖమ్మం జిల్లా జనసేన పార్టీ ఇన్‌చార్జి మిర్యాల రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో అవినీతి ఆరోపణలు, సైబర్ నేరాల కేసులు ఎదుర్కొంటున్నవారే నాయకులుగా చెలామణి అవుతున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజలకు సేవ చేయాలనే ధ్యేయం లేని రాజకీయాలను ప్రజలు ఇక సహించరని స్పష్టం చేశారు.
జనసేన పార్టీకి నిజాయితీ, నిబద్ధత గల యువతే బలం అని పేర్కొన్న మిర్యాల రామకృష్ణ, సమాజ సేవే లక్ష్యంగా ముందుకు సాగే పార్టీ జనసేన మాత్రమేనని తెలిపారు. ప్రజల్లో జనసేనపై విశ్వాసం రోజు రోజుకీ పెరుగుతోందని, ముఖ్యంగా యువత భారీగా ఆకర్షితులవుతోందన్నారు.
రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దాదాపు అన్ని వార్డుల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతి వార్డులో జనసేన జెండా ఎగరేయడమే లక్ష్యంగా కష్టపడి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర యువజన విభాగ అడహాక్ కమిటీ సభ్యులు మిర్యాల శివాజీ, జిల్లా నాయకులు కొమ్మగిరి శరత్, జిల్లేళ్ల మహేష్, సీనియర్ నాయకులు ఆళ్ల నరేష్, రాష్ట్ర విద్యార్థ విభాగ అడహాక్ కమిటీ సభ్యుడు తాళ్లూరి కౌశిక్, నియోజకవర్గ నాయకులు అనిల్ సూరిశెట్టి, షేక్ యాకుబ్ పాషా, సత్తుపల్లి మండల ప్రధాన కార్యదర్శి రవివర్మ దార్ల, సెక్రటరీ వలపుల నాగబాబు, జైచంద్ర గుప్త, ఉప్పు రామకృష్ణ, మలిశెట్టి పవన్, గోపాలరావు, సైఫ్, తుమ్మా సాయికిరణ్, దండు కరుణ, గోదా వీర కృష్ణ, తిరుపతి రాజు బండారు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు.
మరిన్ని Telangana Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


