Janasena Party: జనసేన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏ విధంగా మద్దతు ఇవ్వాలనే అంశంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం వర్తక సంఘం భవనంలో జనసేన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఈరోజు నిర్వహించారు.
ఈ సమావేశంలో రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి తీసుకోవాల్సిన కార్యాచరణ, ప్రజల్లోకి పార్టీ విధానాలను ఎలా తీసుకెళ్లాలి, ప్రతి వార్డులో బూత్ స్థాయిలో బలోపేతం కావడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తూ, అభ్యర్థులకు అండగా నిలవాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లాలోని ముఖ్య నాయకులు, ఇంచార్జులు, మండల అధ్యక్షులు, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనసేన కోఆర్డినేటర్ వేముల కార్తీక్ మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యమని, రాబోయే ఎన్నికల్లో పార్టీని ప్రజల్లో మరింత బలోపేతం చేసేలా కార్యకర్తలు పనిచేయాలని కోరారు.
మరిన్ని Telangana Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


