back to top
31.2 C
Hyderabad
Sunday, March 1, 2026
HomeTelangana Politicsఖమ్మంలో జనసేన భారీ ర్యాలీ | 10వ వార్డు నుంచి కంకణాల నాగరాజు నామినేషన్

ఖమ్మంలో జనసేన భారీ ర్యాలీ | 10వ వార్డు నుంచి కంకణాల నాగరాజు నామినేషన్

Khammam Elections: భారీ ర్యాలీతో 10వ వార్డు నుంచి నామినేషన్ దాఖలు

ఖమ్మం: ఖమ్మం జిల్లా మున్సిపల్ కోఆర్డినేటర్ ఇంచార్జ్ మిరియాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో, ఈరోజు ఖమ్మం నగరంలో జనసేన పార్టీ తరఫున 10వ వార్డు అభ్యర్థి కంకణాల నాగరాజు భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు.

Follow BuzzNewsline: Twitter (X) | Instagram

జనసేన పార్టీ జెండాలు, నినాదాలతో నగర వీధులు మార్మోగగా, ఈ ర్యాలీ ప్రజల్లో విశేష ఉత్సాహాన్ని నింపింది. పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జనసేన ఎన్నికల బరిలో నిలుస్తోందని నేతలు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బండారు రామకృష్ణ, తుడుం ఉత్తమ్ రాజు, బానోత్ దేవేందర్, షేక్ హసీనా, రాకేష్, పుల్లారావు, నరేష్, శ్రీకాంత్, బాణాల శ్రీకాంత్, అఖిల్, మైలవరపు మణికంఠలతో పాటు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు మరియు వీర మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా జనసేన పార్టీ ప్రతి వార్డులో ప్రజల మద్దతుతో ముందుకు సాగుతుందని నేతలు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

మరిన్ని Telangana Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Buzznewsline
Buzznewsline
BuzzNewsline is a next-gen digital media platform delivering real-time news, trending stories, and deep insights across sports, politics, entertainment, tech, and more — all in one place.”

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles