Komatireddy Venkat Reddy: ప్రజల నుంచి విశేష స్పందన
నల్లగొండ: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలో నిర్వహించిన రోడ్ షోకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది. రోడ్ షో మొత్తం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకొస్తున్నాయని అన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు.
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 48 డివిజన్లలో 48 డివిజన్లకు కాంగ్రెస్ కార్పొరేటర్లు గెలిస్తే, పట్టణ అభివృద్ధికి అవసరమైన మరిన్ని నిధులు తీసుకువచ్చే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు.
అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
మరిన్ని Telangana Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


