back to top
31.2 C
Hyderabad
Sunday, March 1, 2026
HomeTelangana Politicsకాంగ్రెస్ అవినీతి, అటెన్షన్ డైవర్షన్ రాజకీయాలను ఎండగట్టిన కేటీఆర్

కాంగ్రెస్ అవినీతి, అటెన్షన్ డైవర్షన్ రాజకీయాలను ఎండగట్టిన కేటీఆర్

KTR Press Meet: తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీవ్ర వ్యాఖ్యలు

తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (@KTRBRS) కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం జారీ చేసిన నోటీసులకు బాధ్యతాయుతమైన నాయకుడిగా హరీష్ రావు ఈరోజు హాజరయ్యారని స్పష్టం చేశారు.

Follow BuzzNewsline: Twitter (X) | Instagram

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేరచరిత్ర ఉందని, డబ్బుల కట్టలతో దొరికిన చరిత్రను ఇతరులకు కూడా అంటించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అడ్డగోలు సిట్ విచారణల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని డ్రామాలు చేసినా, తమ పార్టీ హామీల వైఫల్యం, పరిపాలన వైఫల్యంపై ప్రశ్నిస్తూనే ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు.

ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఇప్పటివరకు ఒక్క అధికారిక ప్రకటన కూడా రాలేదని, కేవలం లీకుల ఆధారంగా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో హరీష్ రావుపై నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసును సుప్రీంకోర్టు కొట్టివేసిందని గుర్తు చేశారు. అయినా కుట్రపూరితంగా నోటీసులు ఇచ్చారని ఆరోపించారు.

సింగరేణి బొగ్గు కుంభకోణంపై కీలక ఆరోపణలు చేసిన కేటీఆర్, ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డి కేంద్రంగా టెండర్ రిగ్గింగ్ జరిగిందని అన్నారు. ఇప్పటివరకు తొమ్మిది సింగరేణి టెండర్లను ముఖ్యమంత్రి కుటుంబం నియంత్రించిందని, అంచనా విలువ కంటే ఎక్కువ ధరలకు టెండర్లు దక్కించుకున్నారని తెలిపారు.

సైట్ విజిట్ సర్టిఫికెట్ పేరుతో కంపెనీలను బెదిరించారని, అర్హులైన సంస్థలకు కూడా సర్టిఫికెట్లు ఇవ్వలేదని విమర్శించారు. ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోందని తెలిపారు.

అమృత్ టెండర్ల స్కాం, రేషన్ బియ్యం స్కాం, మూసీ, లగచర్ల అంశాలపై బీఆర్ఎస్ ప్రశ్నించిన ప్రతిసారీ కాంగ్రెస్ ప్రభుత్వం అటెన్షన్ డైవర్షన్‌కు పాల్పడుతోందని అన్నారు.

“ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని సిట్‌లు వేసినా మేము భయపడము. న్యాయవ్యవస్థపై మాకు పూర్తి నమ్మకం ఉంది. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, తెలంగాణ గళం బీఆర్ఎస్ పార్టీ” అని కేటీఆర్ స్పష్టం చేశారు.

రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడితే, దానికి బాధ్యులైన అధికారులు కూడా భవిష్యత్తులో తప్పించుకోలేరని హెచ్చరించారు. పార్టీ జెండా గద్దెలను ముట్టుకుంటే కార్యకర్తలు ఊరుకునేది లేదని స్పష్టమైన హెచ్చరిక చేశారు.

మరిన్ని Telangana Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Buzznewsline
Buzznewsline
BuzzNewsline is a next-gen digital media platform delivering real-time news, trending stories, and deep insights across sports, politics, entertainment, tech, and more — all in one place.”

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles