Janasena Party joinings: శేరిలింగంపల్లి నుంచి జనసేన పార్టీలో భారీ చేరికలు
తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో, పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, సిద్ధాంతాలకు ఆకర్షితులైన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో జనసేన పార్టీలో చేరుతున్నారని తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జ్ శ్రీ ఎన్. శంకర్ గౌడ్ గారు తెలిపారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వివేకానంద నగర్ డివిజన్ నుంచి డా. మాధవ్ రెడ్డి గారు మరియు డివిజన్ అధ్యక్షులు శ్రీ ప్రవీణ్ సాహూ గారు ఆధ్వర్యంలో పలువురు నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి శ్రీ ఎన్. శంకర్ గౌడ్ గారు సాదరంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, త్వరలోనే శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి మరిన్ని పార్టీ చేరికలు జరగనున్నాయని వెల్లడించారు. తెలంగాణలో జనసేన పార్టీ ప్రజా సమస్యలపై బలంగా పోరాడుతూ ముందుకు సాగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో
జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ గౌరవనీయులు శ్రీ రామ్ తల్లూరి గారు,
పార్టీ వైస్ ప్రెసిడెంట్ శ్రీ బి. మహేందర్ రెడ్డి గారు,
తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జ్ శ్రీ ఎన్. శంకర్ గౌడ్ గారు,
ప్రచార కార్యదర్శి శ్రీ ఆర్.కె. సాగర్ గారు,
కుకట్‌పల్లి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ప్రేమ్ కుమార్ గారు,
రాష్ట్ర నాయకులు శ్రీ రాజలింగం గారు, శ్రీ దామోదర్ రెడ్డి గారు, సంపత్ నాయక్ గారు
మరియు ఇతర రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.
మరిన్ని Telangana Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


