Janasena Party Telangana: నల్లగొండ జిల్లా నుంచి జనసేన పార్టీలో భారీ చేరికలు
కూకట్‌పల్లి ఇంచార్జి శ్రీ ప్రేమ్ కుమార్ గారి ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లాకు చెందిన నేతి హరిప్రసాద్ గారు సహా పలువురు ప్రముఖ నాయకులు జనసేన పార్టీలో చేరారు. ఈ చేరికలు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి గారి సమక్షంలో జరిగాయి.
ఈ సందర్భంగా పార్టీ నేతలు కొత్తగా చేరిన నాయకులకు కండువాలు కప్పి ఆహ్వానించారు. ప్రజా సమస్యలపై పోరాటమే లక్ష్యంగా జనసేన పార్టీ పనిచేస్తోందని, తెలంగాణలో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీ రామ్ తాళ్లూరి గారు, పార్టీ వైస్ ప్రెసిడెంట్ శ్రీ బి. మహేందర్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జ్ శ్రీ ఎన్. శంకర్ గౌడ్ గారు, ప్రచార కార్యదర్శి శ్రీ ఆర్.కె. సాగర్ గారు, కూకట్‌పల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ ప్రేమ్ కుమార్ గారు పాల్గొన్నారు.
అలాగే పార్టీ నాయకులు శ్రీ రాజలింగం గారు, శ్రీ దామోదర్ రెడ్డి గారు, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇంచార్జి శ్రీ మేకల సతీష్ రెడ్డి గారు, మునుగోడు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ గోకుల రవీందర్ రెడ్డి గారు, వైరా నియోజకవర్గ ఇంచార్జి శ్రీ సంపత్ నాయక్ గారు తదితర రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మరిన్ని Telangana Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


