Congress to BJP: కాంగ్రెస్‌ను వీడి 100 మంది అనుచరులతో బీజేపీలో చేరిన జగదీశ్ కులకర్ణి
నిజామాబాద్ నగరం 50వ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ కౌన్సిలర్ జగదీశ్ కులకర్ణి గారు, ఆయన సతీమణి మాజీ కార్పొరేటర్ అర్చన కులకర్ణి గారు తమ డివిజన్‌కు చెందిన సుమారు 100 మంది అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు.
ప్రధాని నరేంద్ర మోడీ గారి పాలన పట్ల ఆకర్షితులై, అలాగే ప్రపంచ వ్యాప్తంగా హిందువులపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలకు చలించిపోయి, హిందువుల ఐక్యత, రక్షణే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీని ఇందూరులో మరింత బలోపేతం చేయాలన్న తమ వార్డు ప్రజల ఆకాంక్ష మేరకు బీజేపీలో చేరుతున్నట్లు వారు ప్రకటించారు.
ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు శ్రీ ధన్‌పాల్ సూర్యనారాయణ గారు, బీజేపీ నాయకుడు అర్వింద్ ధర్మపురి గారు కలిసి వారికి కండువా కప్పి ఘనంగా పార్టీలోకి ఆహ్వానించారు.
బీజేపీ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు, జాతీయవాద భావజాలాన్ని ప్రజల్లోకి మరింత తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా నూతనంగా చేరిన నాయకులు తెలిపారు. ఈ చేరికతో నిజామాబాద్ నగరంలో బీజేపీ బలపడినట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
మరిన్ని Telangana Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


