back to top
31.2 C
Hyderabad
Sunday, March 1, 2026
HomeTelangana Politicsఎదులాపురం మున్సిపల్ ఎన్నికలు | కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఎదులాపురం మున్సిపల్ ఎన్నికలు | కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Ponguleti Srinivasa Reddy: అధికారంతోనే అభివృద్ధి సాధ్యం

ఏదులాపురం: అధికారంలో ఉన్నప్పుడే ప్రాంత అభివృద్ధి సాధ్యమని, అందుకే మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఓటర్లను కోరారు. ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడారు.

Follow BuzzNewsline: Twitter (X) | Instagram

ప్రజల ఆశీర్వాదంతోనే ఏదులాపురాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేసుకునే అవకాశం లభించిందని, ఇకపై అన్ని రంగాల్లో అభివృద్ధి చేయగల శక్తి కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు. సమస్యల పరిష్కారం ఎవరి చేతుల్లో ఉందో, ఎవరికీ అధికారం ఉందో తెలుసుకొని ఓటు వేయాలని సూచించారు. అధికారం లేని ప్రత్యర్థుల మాయమాటలు నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు.

గత పదేళ్లలో ప్రత్యర్థుల చిత్తశుద్ధి ప్రజలకు స్పష్టంగా తెలిసిందని, అభివృద్ధి చేయలేని వారు ఇప్పుడు మాటలతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో మాత్రమే రంగురంగుల కండువాలతో వచ్చి ఓట్లు అడిగి, తర్వాత కనిపించకుండా పోయే వారిని నమ్మవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఏదులాపురం మున్సిపాలిటీ అభివృద్ధికి కావాల్సిన ప్రతి పని తానే బాధ్యతగా తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు.

ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.

🔹 10వ వార్డు – తుమ్మల బిక్షం
🔹 11వ వార్డు – పేరం వెంకటలక్ష్మి
🔹 28వ వార్డు – నూకల రామ్మోహన్ రెడ్డి
🔹 29వ వార్డు – వెంపటి ఉమ
🔹 30వ వార్డు – కొట్టం శిరీష

హస్తం గుర్తుపై ఓటు వేసి, ప్రత్యర్థులకు డిపాజిట్లు కూడా రాకుండా బుద్ధి చెప్పాలని ఓటర్లను కోరారు.

మరిన్ని Telangana Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Buzznewsline
Buzznewsline
BuzzNewsline is a next-gen digital media platform delivering real-time news, trending stories, and deep insights across sports, politics, entertainment, tech, and more — all in one place.”

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles