back to top
31.2 C
Hyderabad
Sunday, March 1, 2026
HomeTelangana Politicsమున్సిపల్ ఎన్నికల్లో జెండా ఎగరాలని పొన్నం ప్రభాకర్ పిలుపు

మున్సిపల్ ఎన్నికల్లో జెండా ఎగరాలని పొన్నం ప్రభాకర్ పిలుపు

Mahabubabad Congress Meeting: మహబూబాబాద్‌లో పొన్నం ప్రభాకర్ సమన్వయ సమావేశం

మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించి, మహబూబాబాద్, ఇల్లందు, కేసముద్రం మున్సిపాలిటీలకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడమే లక్ష్యంగా నేతలంతా సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.

Follow BuzzNewsline: Twitter (X) | Instagram

ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు మురళి నాయక్, కోరం కనకయ్య, డీసీసీ అధ్యక్షులు ఉమా మురళి నాయక్, దేవి ప్రసన్నతో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అన్ని వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ శ్రేణులు ఏకతాటిపై నిలబడి పనిచేయాలని పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.

టికెట్ల కేటాయింపుపై మాట్లాడుతూ, ఏకాభిప్రాయం లేని వార్డులలో ముఖాముఖి చర్చలు జరిపి, సర్వేల ఆధారంగానే పార్టీ టికెట్లు కేటాయించామని, అందరూ ఈ నిర్ణయాన్ని గౌరవించి కలిసి ముందుకు సాగాలని సూచించారు.

పొత్తులో భాగంగా సీపీఐ పోటీ చేస్తున్న స్థానాల్లో కాంగ్రెస్–సీపీఐ కలిసి సమన్వయంతో పని చేయాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మహబూబాబాద్, ఇల్లందు, కేసముద్రం మున్సిపాలిటీలలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులకు డీసీసీ అధ్యక్షుల ద్వారా బి-ఫారాలు అందజేశారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేలా కృషి చేయాలని నేతలకు మంత్రి సూచించారు.

మరిన్ని Telangana Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Buzznewsline
Buzznewsline
BuzzNewsline is a next-gen digital media platform delivering real-time news, trending stories, and deep insights across sports, politics, entertainment, tech, and more — all in one place.”

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles